Tuesday, December 13, 2011
Saturday, December 10, 2011
Monday, November 7, 2011
Saturday, November 5, 2011
T News Interview with Employees JAC Secretary General V. Srinivas Goud
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
- అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె
- అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
- ‘టీ న్యూస్’ ఇంటర్వ్యూలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వి. శ్రీనివాస్‌గౌడ్
‘విప్లవాల యుగం మనది, విప్లవిస్త్తె జయం మనది .. అంటూ అంకుశాపురం కవి చెరబండరాజు ప్రపంచ ఉద్యమాలకు ఇచ్చిన మహత్తర సందేశం ఆలంబనగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఆబాలగోపాలాన్ని కదిలిస్తున్నది. 650మంది నూనూగు మీసాల యువకులు తెలంగాణ ఉద్యమ అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలు ఆహుతి ఇచ్చారు. ఉసురు అనేది ఉంటే.. తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణకు అడ్డంపడుతున్న పెట్టుబడిదారులకు, చేసిన రాజీనామాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న తెలంగాణ రాజకీయ ప్రతినిధులకు తప్పకుండా ఆత్మబలిదానాలు చేసుకున్న పిల్లల ఉసురు తగులుతుంది.
గర్భశోకంతో తల్లడిల్లుతున్న పిల్లల తల్లిదంవూడుల ఆర్తనాదాలు మమ్మల్ని నిద్రపోనీయడం లేదు.’ అంటున్నారు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్. సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే సకల జనుల సమ్మె భారత రాజకీయాలకు, కుట్రలతో తెలంగాణకు ద్రోహం చేస్తున్న నాయకులకు పెను సవాల్ విసరనున్నదంటున్నారు. ఆయనతో టీన్యూస్ ప్రత్యేక ఇంటర్వూ
ప్ర. సకల జనుల సమ్మె ఎందుకు? సమ్మె చేస్తే సకల జనులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జ. తెలంగాణలో వివిధ వృత్తులతో జీవిస్తూ పొట్టపోసుకుంటున్న వారందరూ సమ్మెలోకి కదిలిరావడమే సకల జనుల సమ్మె. రోజూ రెక్కాడితేగాని డొక్కాడని ఈ జనులు ఎందుకు సమ్మెలోకి రావాలి, వారికి వచ్చే ప్రయోజనాలేమిటి? అనేవి ప్రశ్నలే. రిలయన్స్ రంగల మాయాజాలం చూసిన చిన్నా చితకా వ్యాపారులు గంపలో కూరగాయలు పళ్లు అమ్ముకొని ఆరోజుకు మాత్రమే బత్తెం సంపాదించుకొనే వారందరూ భయపడిపోతున్నారు. శీతల మార్కెట్లు చిన్న చిన్న కూరగాయల, పళ్ల వ్యాపారుల పొట్టలను కొట్టుతున్నాయి. ఉద్యమిస్తేనే తమ బతుకులు బాగుపడతాయని వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణ వస్తే బడావ్యాపారుల దోపిడీ తగ్గుతుందని, చిన్న చిన్న అంగళ్లతో సంప్రదాయ వ్యాపారంతో తెలంగాణ పల్లెలు కొత్త అందాలతో మురిసిపోతాయని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఉద్యోగులు ఉద్యోగాలు చేసుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని.. అనవసర పెత్తనం చేస్తున్నారని రాజకీయ నాయకులు దబాయిస్తున్నారు కదా..

తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యోగ సంఘా ల జేఏసీ ఎన్ని విమర్శలనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది. అర్థరహితమైన విమర్శలు గాలికి పేలపిండివలె ఎగిరిపోతాయి. ఇక ఉద్యోగులు ఉద్యోగాలు చేసుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తే, చాలా విషయాలను ప్రస్తావించాల్సి వస్తుంది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తెలంగాణ ప్రజల జీవన్మరణ ఆకాంక్షను విస్మరించారు. ఆరువందల యాభైమంది తెలంగాణ పిల్లల ఆత్మబలిదానాలను విస్మరించారు. జగన్ అనే వ్యక్తికోసం, ఆయనకు మద్దతుగా 30 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. తెలంగాణ సమాజమంతా ఒక్కతాటిన నిలిచి నాలుగున్నర గొంతుకలు ఒక్కటై మా తెలంగాణ మాకు కావాలని ఘోషిస్తున్న సందర్భంలో కూడా తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయకుండా పదవులను పట్టుకొని వేళ్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన నిలిచి ఉద్యమించాలని నిర్ణయించుకున్నాం. ముందుగా మేము తెలంగాణ పౌరులం, ఆ తర్వాత ఉద్యోగులం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారమే తెలంగాణ ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు
ప్రజలు మిలిటెంట్ పోరాటాలకు కూడా సిద్ధపడినట్టు కనిపిస్తోంది. కాని, సోనియా గాంధీ దేశంలో లేనప్పుడు ఆందోళనలు చేయడం సమంజసమేనా?
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మిలిటెంట్ పోరాటంగా అభివర్ణించడానికి నేను సిద్ధంగా లేను. రాష్ట్ర సాధన ఉద్యమం శాంతియుత, ప్రజాస్వామిక ఉద్యమం, విసిగి వేసారిన పిల్లలు ఆత్మబలిదానాలకు పాల్పడినారుకాని, సీమాంధ్ర చీమకు కూడా అపకారం తలపెట్టలేదు. ఇదే తెలంగాణ ఉద్యమ నిజాయితీ. ఇదే తెలంగాణ ఉద్యమ ఔన్నత్యం. చదువులు, ఉద్యోగాలు, , భూములు, బతుకులు అన్నీ కోల్పోయిన యువకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనే తమ బతుకు వెతలకు సమాధానాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను, పెద్దమనుషుల ఒప్పందాలను, ఆరుసూవూతాల పథకాలను, ఫజలలీ కమిషన్ రిపోర్టులను, జీవో 36ను, జీవో 610 ని ఉల్లంఘించిన వారినందరినీ ప్రశ్నిస్తూ చౌరస్తాలో యువకులు నిలబెడుతున్నారు. అడుగడం, ప్రశ్నించడం, ఎలుగెత్తిచాటడం, కష్టాలను వల్లించడం, మిలిటెంట్ పోరాటాలు ఎలా అవుతాయి? ఏపీపీఎస్సీ సీమాంవూధపీఎస్సీగా మారిపోయిన విధానాన్ని చూసి తెలంగాణ విద్యార్థులు, యువకులు, రీసెర్చి స్కాలర్స్ అసహ్యించుకుంటున్నారు. అందుకని సోనియాగాంధీ ఇక్కడ ఉన్నా,లేకున్నా, ఉద్యమాలు ఆగిపోవు. సోనియాగాంధీ లేకుండానే జన్‌లోక్‌పాల్ బిల్లుపై కీలకమైన నిర్ణయం ఎలా జరిగింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ప్రశ్నించగానే సోనియాగాంధీ దేశంలో లేదన్న విషయం గుర్తుకు వస్తున్నది.

సకల జనుల సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతు ఎలా లభిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ టీపీపీల నుంచి మద్దతు లభిస్తున్నదని భావిస్తున్నారా?
ఇదివరలో ఆగస్టు 17 నుంచి సకల జనుక సమ్మె ప్రారంభమవుతుందని ప్రకటించాం. అప్పటికే కాంగ్రెస్, ప్రజా ప్రతినిధులు, టీడీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన నేతలు రాజీనామాలకు కట్టుబడి ఉండలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిలిచి ఉద్యమించాల్సిన ప్రజా ప్రతినిధులు ఆ బాధ్యతలను విస్మరించారు. మేము ఉద్యోగులుగా ప్రతీ రాజకీయ నాయకుడి ఇంటికి బతిమిలాడాం. నాయకత్వం వహించమని అభ్యర్థించాం. మా వంతుగా చేయని ప్రయత్నించలేదు. మా కున్న పరిధులకు, పరిమితులను దాటి కూడా ముందుకు వెళ్లాం. సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా రాజకీయ నాయకుల మద్దతును కోరాం. సహాయ నిరాకరణ ఉద్యమం కూడా పొలిటికల్ జేఏసీ పిలుపు ప్రకారం జరిగిన ఉద్యమమే. సకల జనుల సమ్మె పొలిటికల్ జేఏసీ నిర్ణయమే.

సకల జనుల సమ్మెకు రాజకీయ పార్టీల నాయకుల మద్దతు కూడగట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
రాజీనామాలు చేసిన మంత్రులు కోమటిడ్డి వెంకటడ్డి, జూపల్లి కృష్ణారావు సకల జనుల సమ్మెకు ముందువరుసలో ఉంటామని ప్రకటించారు. ఉద్యోగుల జేఏసీతో కలిసి ఉద్యమించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. రాజీనామాలు చేసి రాజీపడ్డవాళ్లను నిలదీయాల్సిందేనని వారు సమరోత్సాహాన్ని ప్రదర్శించారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన నాయకులను ప్రజలు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ధర్మపురి శ్రీనివాస్ ఎన్ని బాసలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, జైతెలంగాణ నినాదం ఇవ్వనందుకు తెలంగాణ ప్రజలు చెత్తబుట్టలో విసిరికొట్టారు.

తెలంగాణ ప్రజల కోసం నిలిచే రాజకీయ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకుసిద్ధంగా ఉన్నారు. ప్రజల వైపా, తాత్కాలిక పదవులవైపా అనే విషయాన్ని తేల్చుకోవాల్సిన సంధిగ్ధ సమయంలోకి రాజకీయ నాయకులు వచ్చా రు. సీపీఐ, బీజేపీ, న్యూడెమొక్షికసీ వంటి పార్టీలు రాజకీయ కార్యాచరణతో ముందుకు వస్తున్నాయి. కొంతమంది ఎంపీలు కూడా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. 13 వ తేదీ సమ్మె ప్రారంభమైన తర్వాత అసలు విషయం బోధపడుతుంది.
ఇప్పటికే సకల జనుల సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది
ఇలాంటి సందర్భాలలోనే తెలంగాణ రాజకీయ ప్రజా ప్రతినిధులు ప్రతిస్పందించాలని తాము కోరుకుంటున్నాం. ఆగస్టు 17 నుంచి సమ్మె తేదీ ప్రకటించగానే తెలంగాణ జిల్లాలన్నీ పోలీసు క్యాంపులుగా మారిపోయాయి. పారామిలటరీ పోలీసుల పహారాలో తెలంగాణ పొలాల్లో ప్రజలు నాట్లు వేసుకుంటున్నారు. జీవో 177, జీవో 165, 165 వంటి ఆదేశాలను ఇచ్చి ఉద్యోగులను నిర్భంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు సీమాంధ్ర ఉద్యోగులు విధులకు హాజరవుతారని ప్రకటించి ఉద్యోగుల మధ్య అనవసర కాట్లాట పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సకల జనుల సమ్మె సందర్భంలో నైతికంగా మద్దతు ఇచ్చిన ఏపీఎన్జీవో సంఘం సెప్టెంబర్ 13 వచ్చే సరికి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల ఔన్నత్యాన్ని కూడా విస్మరించింది. ఇది కాలమహిమ. ఏపీపీఎస్సీ రాతపరీక్షలో అత్యధికంగా మార్కులు సాధించుకున్న అభ్యర్థికి మౌఖిక పరీక్షలో తక్కువ మార్కులు వేయడాన్ని సమర్థించిన వాళ్ల నుంచి ప్రజాస్వామిక లక్షణాలను ఆశించడం నేతిబీరలో నేయిని వెదుక్కోవడమే. పారామిలటరీ దళాలు, రిజర్వు పోలీసులు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు అడ్డుకట్టవేయలేవు, సమ్మెను విజయవంతం చేసే వ్యూహం మాకు ఉన్నది.
2014 వరకు తెలంగాణ వాయిదానే అంటున్నారు కదా…
తెలంగాణ ఉద్యమం తేదీలతో తిథివార నక్షవూతాలతో ముడిపడి లేదు. ఒకసారి ఎగిసిపడటం, మరోసారి తగ్గిపోవడం ఆయా సందర్భాలను అనుసరించి ఉంటుంది. 1952లో, 1969లో, 2010లో విద్యార్థులు, యువకులు ప్రాణాలను అర్పించారు. తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సిద్దించేవరకు నివురుగప్పిన నిప్పు మాదిరిగా రాజుకుంటూనే ఉంటుంది. కేసిఆర్ నిరశన దీక్ష వంటి గొప్ప సంఘటనలు జరిగినప్పుడు ఉద్యమ జ్వాలలు ఎగిసి పడుతుంటాయి. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమాలు ఉంటాయి.

Thursday, November 3, 2011
Subscribe to:
Posts (Atom)